- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ram Charan: రామ్‌చరణ్ టార్గెట్ ఫిక్స్! రీచ్ అవుతాడా? లేదా?
దిశ, సినిమా: సినీ రంగంలో హీరోలందరూ స్నేహాపూర్వకంగా కలిసి వున్నట్లే కనిపించినా సినిమాల కలెక్షన్ల విషయంలో మాత్రం ఎప్పుడూ పోటీపడుతునే వుంటారు. ఒకరి వసూళ్లను మరొకరు దాటేయాలని ప్రయత్నిస్తుంటారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో కలిసి నటించిన రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల మధ్య ఇప్పుడు ఆసక్తికరమైన పోటీ నెలకొని వుంది. రామ్‌చరణ్‌కు ఎన్టీఆర్ పెద్ద టార్గెట్‌నే ఫిక్స్ చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం తరువాత ఇద్దరి క్రేజ్, ఇమేజ్ అమాంతం పెరిగింది. కానీ ఇద్దరిలో ఎవరి చిత్రాలకు ఎక్కువ ఆదరణ వుంది. పాన్ ఇండియా స్థాయిలో ఎవరి మార్కెట్ పెరిగిందనే చర్చలు ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్నాయి. అయితే ఆర్‌ఆర్‌ఆర్ తరువాత ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. డివైడ్ టాక్‌ను సొంతం చేసుకున్నా.. మంచి ఓపెనింగ్ వసూళ్లతో దేవర రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. తొలిరోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 172 కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ పోస్టర్ విడుదల చేసి అఫీషియల్‌గా ప్రకటించారు. సో.. ఇక రామ్‌చరణ్‌కు, ఎన్టీఆర్ పెద్ద టార్గెట్‌ను ఇచ్చాడు. డిసెంబరు 20న థియేటర్‌లోకి రానున్న చరణ్ చిత్రం ఈ రికార్డును దాటేయాలి. అయితే గేమ్ ఛేంజర్ చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 'భారతీయుడు-2' డిజాస్టర్‌గా నిలవడంతో గేమ్ ఛేంజర్‌పై బజ్ తగ్గింది. ఈ మధ్యనే ఈ చిత్రం పబ్లిసిటీని మొదలుపెట్టారు. మొదటి సింగిల్ పెద్దగా ఆకట్టుకోలేదు. రెండో సింగిల్ కూడా త్వరలో రానుంది. అయితే ఈ చిత్రం టీజర్, ట్రైయిలర్‌లు ఆకట్టుకునేలా కట్ చేసి రిలీజ్ చేస్తే సినిమాపై బజ్ పెరిగే అవకాశం వుంది. అప్పుడే రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఫిక్స్ చేసిన టార్గెట్‌ను రీచ్ అయ్యే అవకాశం వుంది. సో.. గేమ్ ఛేంజర్ రామ్‌చరణ్ కెరీర్‌లో ఎలాంటి ఛేంజర్ అవుతుందో తెలియాలంటే.. సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.