వెంటనే ఆపేయండి.. హైడ్రా అధికారులకు కేఏ పాల్ హెచ్చరిక

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-28 12:18:15.0  )
వెంటనే ఆపేయండి.. హైడ్రా అధికారులకు కేఏ పాల్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలన గాలికి వదిలి హైడ్రా(HYDRA) పేరుతో హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. పెద్దలను వదిలేసి పేద ప్రజలను రోడ్డుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రోడ్డున పడ్డ పేదలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని కోరారు.

అంతేకాదు.. ఆ అక్రమ నిర్మాణాలకు కారణమైన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. హైడ్రాపై హైకోర్టులో హౌస్‌మోషన్ వేస్తా అని కీలక ప్రకటన చేశారు. కాగా, నగరంలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైడ్రాకు ఇటీవల తెలంగాణ సర్కార్(Telangana Govt) విసృత్త అధికారాలు కల్పించింది. ఏవీ రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రా.. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలగించడమే లక్ష్యంగా వర్క్ చేస్తోంది.

Advertisement
Next Story

Most Viewed