రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం పర్యటన..

by Kalyani |   ( Updated:2023-03-22 16:25:46.0  )
రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం పర్యటన..
X

దిశ, వరంగల్ కలెక్టరేట్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు రేపు (గురువారం) పరిశీలిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు ఖమ్మం నుంచి హెలి క్యాప్టర్ ద్వారా మహబూబాబాద్ జిల్లా, పెద్ద వంగర మండలం, రెడ్డికుంట తండాకు చేరుకొని అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలిస్తారన్నారు.

రెడ్డికుంట తండా నుంచి హెలీ క్యాప్టర్ ద్వారా వరంగల్ జిల్లా, దుగ్గొండి మండలం, అడవి రంగాపురం కు చేరుకుని అకాలవర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని వివరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీస్, వ్యవసాయ అధికారులు, సంబంధిత ఇతరశాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మేల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరవుతారని మంత్రి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed