- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగేళ్లుగా భర్తీ కాని కొలువులు.. పెరిగిపోతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు?
దిశ, తెలంగాణ బ్యూరో: కొలువుల ఆశల్లో మరో ఏడాది ముగుస్తున్నది. ఇప్పుడు.. అప్పుడు.. కొలువుల జాతర కాదు కాదు.. కొలువుల కుంభమేళా అంటూ పదేపదే చెప్తున్న ప్రభుత్వం.. ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ప్రకటించిన ఉద్యోగాలను నోటిఫికేషన్లతోనే సాగదీస్తోంది. ఫలితంగా రాష్ట్రంలో కొలువుల భర్తీ కాకి కథలను తలపిస్తోంది. ఇప్పడు వస్తున్న నోటిఫికేషన్లు నియామక ప్రక్రియను పూర్తి చేసుకోవాలంటూ కనీసం ఏడాది నుంచి రెండేండ్లు పడుతుందని అధికారులే చెప్తున్నారు. దీంతో ఈ ఏడాది ఒక్క సర్కారు ఉద్యోగం ఇవ్వకుండా మరోసారి రికార్డుకెక్కింది. వాస్తవంగా గత నాలుగేండ్ల నుంచి రాష్ట్రంలోని నియామక సంస్థలు ఉండీ లేనట్టుగా మారిపోయాయి. డిపార్ట్మెంట్ పరమైన పరీక్షలకే పరిమితమయ్యాయి.
స్వరాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ.. ఆర్థిక కష్టాలను తట్టుకోలేక ఈ ఏడాది కాలంలో 27 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ఆత్మహత్యను సెల్ఫీ వీడియోలు తీసి పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి.
నోటిఫికేషన్లు ఇచ్చినా.. భర్తీ కాలే
టీఆర్ఎస్ సర్కారు పగ్గాలు చేపట్టిన తొలి ఏడాది ఉద్యోగాల భర్తీ చేపట్టలేదు. ఆ తర్వాత ఏడాది నుంచి అడపాదడపా నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇలా 2015 నుంచి 2021 వరకు 15 నోటిఫికేషన్లు జారీ చేశారు. చివరి నాలుగేండ్లు మరీ ఆధ్వాన్నంగా మారింది. 2018లో 25 నోటిఫికేషన్లు వస్తే.. ఆ తర్వాత ఏడాది కేవలం మూడు నోటిఫికేషన్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత అంటే 2020లో కేవలం ఒకే ఒక్క నోటిఫికేషన్ఇచ్చారు. గత ఏడాది నుంచి కొలువుల భర్తీపై ఊరించడం మొదలైంది. కానీ, గడిచిన ఏడాది లెక్కలకే పరిమితమయ్యారు. ఇలా 2021 వరకు మొత్తం 36వేల పోస్టులకు 105 నోటిఫికేషన్లు ఇచ్చినా వీటిలో 29 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. వివిధ కారణాలు, కోర్టు కేసులతో 7 వేల పోస్టులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.
50 వేలంటూ మొదలు
మూడేండ్ల నుంచి త్వరలో 50 వేల కొలువులు భర్తీ చేస్తామంటూ ప్రభుత్వ పెద్దలు ప్రకటిస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ నుంచి మొదలుకుని మండలస్థాయిలో ఎంపీపీల దాకా పలు సందర్భాల్లో ఇదే మాట చెబుతూ వచ్చారు. కానీ, ఒక్క పోస్టునూ ఇవ్వలేదు. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో 91 వేల పోస్టులను భర్తీ చేస్తున్నామని, వీటిలో 11 వేల కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కానీ, ఇప్పటిదాకా కూడా ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం రాలేదు. అటు కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్కూడా పెండింగ్ పడింది.
ఆశల్లోనే ఏడాది
ప్రతిఏటా నిరుద్యోగులు ఆశల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ఏడాది.. వచ్చే ఏడాది ఉద్యోగం వస్తుందని ఆశ పడుతూనే ఉన్నారు. కానీ, ఈయేడు నోటిఫికేషన్లు మినహా.. ఉద్యోగాలు ఇవ్వడం లేదు. 2021లో ఒక్క సర్కారు కొలువు ఇవ్వలేదు. అదే కోవలో ఈ ఏడాది కూడా ముగిసింది. ప్రస్తుతం నోటిఫికేషన్లు వస్తున్నా.. భర్తీ ప్రక్రియ మాత్రం ముందుకు పడటం లేదు. గ్రూప్-1తో పాటుగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రాత పరీక్షలు నిర్వహించారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కూడా రాత పరీక్ష పూర్తి చేసి, ఈవెంట్స్ తేదీలను ప్రకటించింది. అటు గ్రూప్–1పైనా కోర్టు కేసులున్నాయి. దీంతో తుది ఫలితాలు ప్రకటించేందుకు అవకాశం లేదు. మరోవైపు రవాణా శాఖలో ఎఏంవీఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా.. దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితోనే..
తెలంగాణ రాష్ట్రమొస్తే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పదమే వినపడొద్దని చెప్పిన కేసీఆర్.. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయకుండా అతి తక్కువ జీతానికి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్‌ను పెట్టుకుని నెట్టుకొస్తున్నారు. ఎన్నటికైనా తమ ఉద్యోగం పర్మినెంట్ కాకపోతుందా అనే ఆశతో వీళ్లంతా ఏండ్ల తరబడి వెట్టి చాకిరి చేస్తున్నారు. రాష్ట్రంలో 50,400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 58,128 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డ్యూటీ చేస్తున్నారు. వీరిలో 11 వేల పోస్టులను రెగ్యులర్ చేస్తామని చెప్పినా.. ఇప్పటికీ మోక్షం రాలవడం లేదు.
ఏండ్లు వెయిట్ చేయాల్సిందేనా..?
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు, నోటిఫికేషన్లపై కొంతమేరకు స్పష్టత వచ్చినప్పటికీ.. వాటి భర్తీకి మాత్రం కనీసం రెండేండ్లు టైం పడుతుందని అధికారులు చెప్తున్నారు. చాలా రకాల ఉద్యోగాలు, ఉద్యోగాలు ఉన్నందున వాటన్నింటికీ ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో పాటుగా వాటిపై న్యాయపరమైన చిక్కులపైనా సమయం పడుతుందంటున్నారు. ఆయా పోస్టులకు నోటిఫికేషన్ తర్వాత దరఖాస్తుకు కనీసం నెల రోజులు, ఆ తర్వాత ప్రిపరేషన్‌కు మూడు, నాలుగు నెలలు, పరీక్ష రాశాక ఫలితాలకు మరో రెండు, మూడు నెలలు, ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు నెల రోజులు, ఇంటర్వ్యూకు/ఈవెంట్స్‌కు ఒకటి, రెండు నెలలు పట్టే అవకాశముంది. ఈ తతంగమంతా వెంటవెంటనే నిర్వహించినా కనీసం ఏడాదిన్నర పడుతుందని, మధ్యలో ఏవైనా అవాంతరాలు ఎదురైతే మరో ఆర్నెల్లు, ఏడాది పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గతంలో టీఎస్ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2, గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఐదేండ్లు పట్టగా, టీఆర్టీలో కొన్ని పోస్టుల భర్తీ ఆరేండ్లయినా పూర్తి కాలేదు.
గురువులకూ బ్రేక్
విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్ జాబ్‌కు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఈ ఎగ్జామ్‌ను ఆరు నెలలకోసారి నిర్వహించాల్సి ఉండగా మన రాష్ట్రంలో ఐదేండ్లుగా నిర్వహించలేదు. రాష్ట్రం వచ్చాక 2016 మే 22న తొలిసారి టెట్ నిర్వహించగా 2017 జులై 23న రెండోసారి టెట్ పెట్టారు. ఆ తర్వాత టెట్ ఆలోచనే మరిచిపోయారు. తాజాగా 2022లో మళ్లీ టెట్ నిర్వహించారు. ప్రస్తుతం టెట్ నిర్వహించినా.. ఒక్క గురువు పోస్టు కూడా ఇవ్వలేదు.
వీటిలో భర్తీ చేసినవి 29,091
పెండింగ్‌లో ఉన్నవి 7552
READ MORE
నర్సింగ్ అడ్మిషన్లలో హెల్త్యూనివర్సిటీ అత్యుత్సాహం.. ఈసారైనా న్యాయం జరిగేనా?