నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 327 పోస్టులతో సింగరేణిలో జాబ్ నోటిఫికేషన్ విడుదల

by Mahesh |   ( Updated:2024-03-14 14:26:42.0  )
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 327 పోస్టులతో సింగరేణిలో జాబ్ నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రస్తుతం కొలువుల జాతర కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పదాలను దృష్టిలో పెట్టుకుని ప్రక్షాళన చేసి ఒక్కోక్కటిగా కాళీ ఉన్న అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో ఈ అండ్ ఎం మేనేజ్మెంట్ ట్రైనీ (ఎగ్జిక్యూటివ్ క్యాడర్) 42 పోస్టులు, సింగరేణిలో మేనేజ్మెంట్ ట్రైని(సిస్టమ్స్) 7 పోస్టులు, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ గ్రేడ్ సీ 100 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ(మెకానికల్ గ్రేడ్ సి) 9 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ గ్రేడ్ సీ-2 పోస్టులు, సింగరేణిలో ఫిట్టర్ ట్రైనీ కేటగిరి -1లో 47 పోస్టులు, సింగరేణి ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరి-1లో 98 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు.

Advertisement

Next Story