Jeevan Reddy: కేటీఆర్ కు జీవన్ రెడ్డి కౌంటర్

by Prasad Jukanti |
Jeevan Reddy: కేటీఆర్ కు జీవన్ రెడ్డి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫార్ములా ఈ కార్ రేసు కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నాలను కేటీఆర్ చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) విమర్శించారు. ఈ కేసులో ఓ వైపు విచారణను ఎదుర్కొంటున్న కేటీఆర్ (KTR) చర్చను పక్కదారి పట్టించేందుకే జడ్జి వద్దకు రావాలంటూ సవాల్ విసురుతున్నారని కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం సీఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాము దీక్ష చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తోందని చెప్పుకోవడానికే బీఆర్ఎస్ ఇవాళ రైతు దీక్ష చేస్తోందన దుయ్యబట్టారు. పదేళ్లు రైతులను మోసం చేసిన బీఆర్ఎస్ (BRS) ఇవాళ రైతుల పేరుతో ధర్నా చేస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ. 12 వేల ఆర్థిక సాయం ఈ నెల 26వ తేదీ నుంచి ఇస్తున్నామని గత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీని మర్చిపోయిందని విమర్శించారు. మా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తోందన్నారు. సన్నాలు పండిస్తున్న రైతులకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని దేశంలో ఈ విధంగా ఎవరూ చేయడం లేదన్నారు. వరంగల్ డిక్లరేషన్ ప్రకారం రైతులకు రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశాన్నారు. కానీ బీజేపీ రుణమాఫీ మాట ఊసే ఎత్తలేదన్నారు. కాంగ్రెస్ రుణమాఫీ చేస్తుంటే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి నీయి ఆయోగ్ ప్రస్తావిస్తే బాగుండేదన్నారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం స్కీమ్, 200 యూనిట్ల విద్యుత్ వినియోగం వంటి పథకాలను బీఆర్ఎస్ అమలు చేయలేదన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ పథకం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చినదాన్నే కొనసాగించిందన్నారు.

Advertisement
Next Story

Most Viewed