- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జాతకం చూపించుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ ట్విస్ట్
దిశ, నిజాంసాగర్: ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఊరూవాడ తిరుగుతూ ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రాధేయపడుతున్నారు. ఇలా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే కాదు.. ఇష్ట దైవాలను దర్శించుకుంటున్నారు. జ్యోతిష్యులను కలిసి జాతక ఫలాలను చెప్పించుకుంటున్నారు. ఇదే బాటపట్టారు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్. శుక్రవారం ఉదయాన్నే నిజాంసాగర్ మండలంలోని శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దైవ దర్శనం అనంతరం గణపతి ఉపవాసకులు సంజీవరావు పంతులు వద్ద తన జాతకాన్ని చూపించుకున్నారు.
అయితే ఈ సారి ఎమ్మెల్యే గెలుపుపై సంజీవరావు పంతులు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సారి ఎన్నికల్లో కొంచెం కష్టంగానే ఉంటుందని జోస్యం చెప్పారు. కొద్దిపాటి మెజారిటీతో గెలుపొందవచ్చని చెప్పారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ ఈ సారి రాదని కుండబద్దలు కొట్టారు. మరి ఎమ్మెల్యే జాజాల సురేందర్ జాతకం నిజమవుతుందా.. కాదా అనేది తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ పూజల్లో ఎమ్మెల్యే వెంట సీనియర్ నాయకులు, ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఇతర నాయకులు ఉన్నారు.