- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jaggareddy: ‘ఎందుకు అలా చేశారు’.. మెగాస్టార్ చిరంజీవిపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నల్లా చట్టాలు తెచ్చి రైతుల చావులకు కారణమైన ప్రధాని మోడీని చిరంజీవి అభినందించారు.. అదే రైతుల క్షేమం కోసం పోరాడిన రాహుల్ గాంధీకి మాత్రం మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. రైతుల నష్టాలపై సినిమాలు తీసే చిరంజీవి.. బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రైతుల కష్టాలపై సినిమాలు తీసే మీరు.. రైతుల ప్రాణాలు తీసిన బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని నిలదీశారు. ఇక, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్ రూ.7లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో అప్పటి మంత్రి హరీష్ రావు భాగస్వామి కాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.31 వేల కోట్లు మాఫీ చేసిందని.. బీజేపీ కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. నల్ల చట్టాలకు తీసుకువచ్చి రైతుల నడ్డి విరిచారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేయడంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు షాక్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్‌లు చేయడానికి మాత్రమే పనికి వస్తారని సెటైర్ వేశారు. కాగా, ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మెగస్టార్.. కొన్నాళ్ల తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మాజీ కాంగ్రెస్ మంత్రి మెగాస్టార్‌పై జగ్గారెడ్డి విమర్శలు ఎక్కుపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది.