- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క క్షణం కూడా వృథా చేయట్లేదు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేస్తోన్న ఆరోపణలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గురువారం గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజల మధ్య ఉండేది కాంగ్రెస్.. ఫాంహౌజ్‌లో ఉండేది కేసీఆర్ అని విమర్శించారు. కాంగ్రెస్, రేవంత్‌కు కావాల్సింది ప్రజా పరిపాలన అయితే.. కేసీఆర్, కేటీఆర్‌కు కావాల్సింది ఉప ఎన్నికలు అని మండిపడ్డారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని రుణమాఫీని తాము ఎనిమిది నెలల్లో చేసి చూపించామని అన్నారు.
తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలు.. ముఖ్యంగా కేసీఆర్‌కు ఇష్టం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ గల్లీ పార్టీ అని.. కాంగ్రెస్ ఢిల్లీ పార్టీ అని అన్నారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించారు. ప్రజలు నచ్చి, మెచ్చే పాలనను తమ ప్రభుత్వం అందిస్తోంది. వారు ఇచ్చిన సమయాన్ని వృథా చేయట్లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలు, లోపాలు అన్ని ఇన్నీ కావు. వాటన్నింటినీ సవరిస్తాం. తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తాం. ఆ తప్పిదాలు మరోసారి జరగకుండా చూస్తామని అన్నారు.