నాతో మాట్లాడాలంటే భయపడిపోతున్నారు: జగ్గారెడ్డి

by Sathputhe Rajesh |   ( Updated:2022-03-22 06:00:49.0  )
నాతో మాట్లాడాలంటే భయపడిపోతున్నారు: జగ్గారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: టీ కాంగ్రెస్ లో విబేధాలు రచ్చకెక్కాయి. సీనియర్లు ప్రైవేట్ హోటల్ లో సమావేశం నిర్వహించడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో జగ్గారెడ్డిని పార్టీ పదవుల నుంచి తొలగించడం ప్రకంపనలు రేపుతోంది. దీనిపై జగ్గారెడ్డి సీరియస్ గా ఉన్నారు. తనకు ఢిల్లీ నుంచి పిలుపు రాలేదని, రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి అంటే ఏంటో తెలియాలన్నారు. కొందరి నేతల గుణగణాలపై మాట్లాడుతానని, తనతో భట్టి, ఉత్తమ్ సహా ఎవరూ మాట్లాడట్లేదని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనతో మాట్లాడేందుకు భయపడుతున్నట్లున్నారని చెప్పారు.

Advertisement

Next Story