మాకు ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదు.. అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |
మాకు ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదు.. అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభా సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. విద్యుత్ శాఖపై చర్చను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. విద్యుత్‌ అవకతవకలపై కమిషన్‌ వేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అధిక విద్యుత్‌ను తెలంగాణకు యూపీఏ ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా అవసరాల మేరకు విద్యుత్‌ కేటాయించారని తెలిపారు. అనంతరం కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి.. సభకు రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఏందుకు? ప్రతిపక్ష హోదా కేసీఆర్‌ కాకుండా వేరేవారు తీసుకోవాలని అన్నారు.

అనంతరం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ సబ్జెక్ట్ మీద చర్చ పెడుతున్నారో తమకు ముందుగా సమాచారం ఇవ్వాలని సీరియస్ అయ్యారు. చర్చ జరగానికి కొన్ని నిమిషాల ముందు బుక్స్ ఇవ్వడం ఏంటి అని మండిపడడ్డారు. అసలు ఏం మాట్లాడాలో అర్ధం కావట్లేదని అన్నారు. ఉదయం 4.30 గంటలకు పుస్తకాలు ఇస్తే ఎలా తీసుకోవాలని, ఏం ప్రిపేర్ కావాలి అని ప్రశ్నించారు. కొన్ని అంశాలపై పుస్తకాలు వచ్చాయి.. మరికొన్ని అంశాలపై పుస్తకాలు రాలేదన్నారు. కనీసం రేపటి అంశాలకు సంబంధించిన పుస్తకాలు అయినా ఇవాళ ఇవ్వాలని అడిగారు. అవసరమైతే మరో 10 రోజులు అదనంగా సభను నడుపుదాం అని అన్నారు. రైతుల పొలాల్లో మీటర్లు పెట్టడానికి ఆరోజు కేసీఆర్ ఒప్పుకోలేదని గుర్తుచేశారు. ఆ విషయంలో కేంద్రం రూ.30 వేల కోట్లు కూడా వదులుకున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story