vote for note case: ఓటుకు నోటు కేసు.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్

by Prasad Jukanti |   ( Updated:2024-08-29 07:26:22.0  )
vote for note case: ఓటుకు నోటు కేసు.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు ట్రయల్ బదిలీ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే మన న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సీఎం కావడంతో విచారణను భోపాల్ కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ట్రయల్ పై పూర్తి అనుమానాలు ఉన్నాయని, కేసును విచారించే ఏసీబీ (హోంశాఖ) సీఎం పరిధిలో ఉందని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. ప్రభుత్వ కౌంటర్ అఫిడవిట్ లో వైఖరి మారిందని జగదీశ్ రెడ్డి న్యాయవాది వాదించారు. దీంతో మాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్న ధర్మాసనం.. స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed