- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Vikarabad Incident: కలెక్టర్‌పై దాడి ఘటనపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సీరియస్
దిశ, తెలంగాణ బ్యూరో: వికారాబాద్ జిల్లాలో కలెక్టర్( Vikarabad Collector), అదనపు కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(Telangana Employees JAC) చైర్మెన్ వి.లచ్చిరెడ్డి తెలిపారు. అధికారులపై దాడికి ఉసిగొల్పిన, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర డీజీపీ(DGP) దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరుగకుండా చర్యలు చేపట్టాలని కోరనున్నట్లుగా తెలిపారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రక్రియలో భాగంగా గ్రామసభలో ప్రజాభిప్రాయానికి సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్,అదనపు కలక్టర్, కడా ప్రత్యేక అధికారి, కొండగల్ తహశీల్దార్, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది వచ్చారన్నారు. ఈ సమయంలోనే కొందరు అధికారులపై దాడులు చేశారన్నారు. వాహనాలను సైతం ధ్వంసం చేశారన్నారు. ఇది హేయమైన చర్య. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఇలాంటి దాడూలతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.
తహశీల్దార్ల ఖండన
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, సెక్రటరీ జనరల్ ఫూల్ సింగ్ చౌహాన్ తీవ్రంగా ఖండించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దాడి జరిగిందన్నారు. అధికారులపై దాడికి ఉసిగొల్పిన, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.