హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం.. Phoenix రియల్ ఎస్టేట్ కంపెనీపై పంజా

by GSrikanth |   ( Updated:2022-08-23 06:23:50.0  )
హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం.. Phoenix రియల్ ఎస్టేట్ కంపెనీపై పంజా
X

దిశ, ఖైరతాబాద్: హైదరాబాద్‌లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఉదయం నగరంలోని ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ సోదాలు జరుపుతున్నారు. ఫీనిక్స్‌కు సంబంధించిన 10 చోట్ల సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్‌లోని కార్పొరేట్ ఆఫీస్‌‌తో పాటు ఫీనిక్స్ చైర్మన్లు డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఫీనిక్స్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తోంది. నగరంలోని పలు చోట్ల వెంచర్స్ రియల్ ఏస్టేట్ ఇన్ ఫ్రాలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టింది. కాగా హైదరాబాద్‌లోని రియల్ ఏస్టేట్ వ్యాపార సంస్థలపై వరుసగా జరుగుతున్న ఐటీ దాడులు చర్చనీయాంశం అవుతోంది.




Advertisement

Next Story