బ్రేకింగ్: హైదరాబాద్‌లో వర్షం.. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

by Satheesh |
బ్రేకింగ్: హైదరాబాద్‌లో వర్షం.. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. కొండాపూర్, గచ్చిబౌలి, చందానగర్, పటాన్ చెరు, శేరిలింగపల్లిలో భారీ వర్షం పడుతోంది. సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. కూకట్ పల్లి, హైదరనగర్, ఆల్విన్ కాలనీ, కేపీహెచ్‌బీ, వివేకానంద నగర్, నిజాంపేట్, బాచుపల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఈదురు గాలుల దాటికి పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్థంబాలు నేలకొరగడంతో విద్యుత్‌ ప్రసారానికి అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వరద నీరుగా భారీగా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed