కేంద్రంలో మన ప్రభుత్వమే.. 25 లక్షల మందికి ఆ స్కీం : KCR

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-15 02:28:13.0  )
కేంద్రంలో మన ప్రభుత్వమే.. 25 లక్షల మందికి ఆ స్కీం : KCR
X

అంబేడ్కర్ మార్గదర్శనం చేసిన రాజ్యాంగం.. 75 సంత్సరాలు దాటిపోతున్నది. ఈ సమాజంలో అనేక మంది మేథావులు ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. గుండెమీద చేయి వేసుకుని మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అంబేడ్కర్ జయంతులు జరుపుతూ పోవడమేనా? ఆయన చెప్పింది ఆచరించేంది ఏమైనా ఉందా? ఆదిశగా కార్యచరణ ఏమైనా ఉందా? లేదా? ఇది ఈ రోజు భారత దేశం ప్రశ్నించుకోవాలని నేను మనవి చేస్తున్న.. అంబేడ్కర్ విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తే ఏర్పాటు చేయలేదు. ఈ విగ్రహంలో ఒక సందేశం ఉంది.

ప్రతి రోజూ సెక్రటేరియట్ కు వచ్చే ముఖ్యమంత్రికి గానీ, మంత్రులకు గానీ సెక్రటరీలకు గానీ అంబేడ్కర్ ఆలోచనలు వస్తుండాలె. అంబేడ్కర్ గారిని చూస్తూ వారి మనసు ప్రభావితం కావాలె. నిత్యం ఆయన సిద్దాంతం, ఆశయం కళ్లల్లో మెదలాలని, తమ జీవితాలు అర్పించిన తెలంగాణ అమరులు కూడా మనకు ఆదర్శం కావాలని ఈ కాంప్లెక్స్‌ను రూపకల్పనం చేసుకోవడం జరిగింది. ఇది విగ్రహం కాదు. ఒక విప్లవం. ఇది కేవలం ఒక ఆకారానికి ప్రతీక కాదు. ఇది తెలంగాణ కలలు సాకారం చేసే ఓ చైతన్య దీపిక.

దిశ, తెలంగాణ బ్యూరో : అంబేడ్కర్ ఓ విప్లవస్ఫూర్తి అని, ఆయన విశ్వమానవుడని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలో ఏర్పాటు చేసిన 125 అడుగులు అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం ప్రకాశ్ అంబేడ్కర్ (అంబేడ్కర్ మనవడు)తో కలిసి కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అంబేడ్కర్ జయంతిని జరుపుకోవడమే కాదని ఆయన ఆశయాలను పాటించాలని సూచించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో రాబోయే ప్రభుత్వం తమదేనని, ఇది తమ శత్రువులకు మింగుడు పడకపోవచ్చని తెలిపారు.

కానీ, ఒక అంటుకోవడానికి ఒక చిన్న మినుగురు చాలని తెలిపారు. ఇటీవల మహారాష్ట్రకు వెళ్తే తనకు ఊహించని విధంగా ప్రోత్సాహం అందిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, బెంగాల్‌.. ప్రతీచోట కూడా ప్రోత్సాహం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగం అమలైనప్పటి నుంచి అనేక పార్టీలు గెలుపొందడం, ఓడడం ప్రభుత్వాల్లో మారడం జరుగుతున్నదని తెలిపారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దళితులు నిరుపేదలుగా ఉండటం సిగ్గుచేటని, ఈ పరిస్థితి మారాలన్నారు.

పార్టీలు గెలవడం కాదు, ప్రజలు గెలిచే రాజకీయం దేశంలో రావాలని ఆకాక్షించారు. అందుకోసం దళిత మేధావివర్గం ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, శాంతిమూర్తి బుద్ధుడిని విగ్రహాలు అద్భుతమైన సందేశాత్మకమైన చిహ్నాలని తెలిపారు. బీఆర్ఎస్ కంటే ముందు ఉన్న ప్రభుత్వం.. పదేండ్ల కాలంలో దళితుల అభివృద్ధి కోసం రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తే, బీఆర్‌ఎస్‌ రూ.1.25లక్షల కోట్లు ఖర్చు చేసిందని చెప్పుకొచ్చారు. ఇది కాగ్ నిర్దారించినదేనని తెలిపారు.

అంబేడ్కర్ కలలు ఇంకా మిగిలే ఉన్నాయి

‘దేశంలో మన ప్రభుత్వం వచ్చాక దళితబంధు తరహా పథకం అమలు చేస్తాం, ప్రతి సంవత్సరం 25లక్షల దళిత కుటుంబాలకు అందజేస్తాం’ అని తెలిపారు. అంబేద్కర్ కలలు ఇంకా మిగిలే ఉన్నాయని, వాటిని సాకారం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్రంలో 50వేల మందికి దళితబంధు అందజేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 1.25లక్షల మందికి అందించబోతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్‌ పేరును పెట్టుకున్నామ‌ని, ఈ నెల 30న దానిని ప్రారంభించనున్నానమి తెలిపారు. వచ్చే ఏడాది నుంచి అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన పేరుతో అవార్డులు అందిస్తామని ప్రకటించారు.

ఇందుకోసం రూ.51కోట్ల శాశ్వత నిధి ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా ఏటా వచ్చే రూ.3 కోట్ల వ‌డ్డీతో దేశం, రాష్ట్రంలో ఉత్తమ సేవ‌లందించిన వారికి అవార్డులు అంద‌జేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో దేశాన్ని కూడా సరైన వరుసలో పెట్టేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తామన్నారు. ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదన్నారు. జై భీమ్‌ అని ప్రసంగాన్ని ముగించారు. అనంతరం డిక్కీ సభ్యులకు దండుమల్కాపురంలో కార్యాలయ ఏర్పాటుకు 2 ఎకరాల స్థలానికి సంబంధించిన పత్రాలను కేసీఆర్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు జోగినపల్లి సంతోశ్ కుమార్, కే కేశవ రావు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, డీజీపీ అంజన్ కుమార్, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, శాసమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

చరిత్ర పుటల్లో నిలిచే రోజు : మంత్రి కొప్పుల

ఇది దేశ చరిత్ర పుటల్లో నిలిచే రోజని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3తోనే కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ర్టం సాధించుకున్నామన్నారు. ఈ విగ్రహం స్థాపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అంబేడ్కర్ స్పూర్తిని భవిష్యత్ తరాల వారికి అందించాలన్న లక్ష్యంతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాష్ర్టంలోని 119 నియోజక వర్గాల్లో 38 వేల 323 ఎస్సీ కుటుంబాలు దళితబంధు పథకం ద్వారా లబ్ధిపొందాయని తెలిపారు.

చారిత్రక ఘట్టం - సీఎస్ శాంతికుమారి

అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చారిత్రక ఘట్టమని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నారు. విగ్రహం నిత్యం చైతన్య దీప్తి అని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన కొద్ది ఏండ్లలోనే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. ఇది దేశ తలసరి ఆదాయం కన్నా ఎక్కువని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు.. ఎమ్మెల్సీ కవిత బిజినెస్ లింకులపై ఫోకస్

Advertisement

Next Story

Most Viewed