- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా చిత్రీకరించడం తగదు’ Muralidhar Rao.. ..
దిశ, తెలంగాణ బ్యూరో : తాను చిట్‌చాట్‌లో చెప్పిన అంశాలకు భిన్నంగా మీడియాలో వార్తలు వచ్చాయని, కొన్ని మీడియా సంస్థలు ఎన్నికల వేళ చెలిమెలో చేపలు పడుతున్నాయని మధ్యప్రదేశ్ ఇన్ చార్జీ మురళీధర్ రావు అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఏం మాట్లాడానో అదంతా సోషల్ మీడియాలో ఉందన్నారు. బీఆర్ఎస్‌ను ఏవిధంగా ఓడించవచ్చు అనే అంశంపైనే తాను మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 65 శాతం 35 ఏండ్ల యువతే ఉందన్నానని చెప్పానన్నారు. సీఎం కేసీఆర్ ఓటమి యువకులతోనే సాధ్యమని చెప్పానని పేర్కొన్నారు.
అవసరాలకు అనుగుణంగా వక్రీకరించడం జర్నలిజం కాదని ఆయన చెప్పారు. కేసీఆర్ వాగ్ధానాలు, వైఫల్యాలపై పోరాడాలని చెప్పానని ఆయన తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని చిత్రీకరించాలని చూస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయంగా ప్రజలు అనుమతించబోరని మురళీధర్ రావు చెప్పారు. కాంగ్రెస్‌పై ప్రజలకు అనుమానాలున్నాయన్నారు. తెలంగాణలో పెరిగే పార్టీ బీజేపీ అని, మిగతావన్నీ తరిగే పార్టీలే అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా పార్టీ ఎదుగుదల ఆగదన్నారు.
సంజయ్ నాయకత్వంలో పార్టీ గణనీయంగా పెరిగిందని ఆయన వెల్లడించారు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనూ పార్టీ పెరగటం ఖాయమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల విషయంలో మధ్యప్రదేశ్, కర్ణాటకను పోల్చడం సరికాదని చెప్పానని ఆయన తెలిపారు. బీజేపీ సిద్ధాంతాల కోసం పని చేసే పార్టీ తప్ప.. అమ్ముడుపోయే పార్టీ కాదని మురళీధర్ రావు అన్నారు. జాతీయ పార్టీగా మారాలనుకున్న బీఆర్ఎస్ కర్ణాటక ఎన్నికల్లో పోటీ ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.