ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి PAC చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుచేటు: కేటీఆర్

by Mahesh |   ( Updated:2024-09-10 13:09:34.0  )
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి PAC చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుచేటు: కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని మూడు కీలక కమిటీలను ఏర్పాటు చేస్తూ శాసనసభ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేషన్, పబ్లిక్ టేకింగ్ కమిటీలకు చైర్మన్లు, సభ్యులను నియమించారు. ఇందులో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అరికపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎన్.పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా కె.శంకరయ్య లకు భాద్యతలు ఇచ్చారు. కాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వడంపై కేటీఆర్ మండిపడ్డారు. దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్.. తన ట్వీట్ లో.." ఫిరాయింపు ఎమ్మెల్యేకు PAC చైర్మన్ పదవా ? సిగ్గు సిగ్గు, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై.. హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం, ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ ఛైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి ?? దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం ?రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా ? అంటూ రాసుకొచ్చారు. కాగా ఈ పీఎసీ పదవి కోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ నామినేషన్ వేయగా.. కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీ కూడా నామినేషన్ వేశారు.

Advertisement

Next Story

Most Viewed