- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన గృహజ్యోతి జీరో బిల్లుల జారీ
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గృహజ్యోతి స్కీమ్ కింద జీరో బిల్లుల జారీ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే విద్యుత్ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో వినియోగదారులకు జీరో బిల్లులు అందజేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి నెలకు 200 యూనిట్లు వినియోగించే గృహ విద్యుత్ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ వర్తింపజేస్తున్నారు. ఈ స్కీమ్ ను ఫిబ్రవరి నెల 27న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా గత నెలలో విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లుల స్థానంలో జీరో బిల్లులు అందజేస్తున్నారు. అధికారులు జారీ చేస్తున్న జీరో బిల్లులో వినియోగించిన విద్యుత్ కు ఎంత చార్జి అయిందో పేర్కొంటున్నారు. ఆ తర్వాత గృహజ్యోతి సబ్సిడీ కింద ఆ మొత్తాన్ని మైనస్ గా చూపిస్తూ నెట్ బిల్ అమౌంట్ జీరోగా చూపిస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం ఉచిత విద్యుత్ స్కీమ్ అణలు చేయడంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిరంతర ప్రక్రియ:
ప్రజాపాలన సభల ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఈ స్కీమ్ వర్తింపజేస్తున్నారు. ఈ స్కీమ్ కు అర్హతలు ఉండి ఈ పథకం లబ్ది పొందలేని వారికి విద్యుత్ సిబ్బంది తగిన సూచనలు చేస్తున్నారు. గృహజ్యోతి పథకం నిరంతర ప్రక్రియ అని అర్హులైన వారు మండల కార్యాలయాలల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.