- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS Plenary 2022: పేరు ఫిక్సయిందా? కేసీఆర్ పెట్టబోయే కొత్త పార్టీ పేరు ఇదేనా?
TRS Plenary 2022
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్లీనరీలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలే లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) చేయాలని కొంతమంది ఎమ్మెల్యేలు కోరుతున్నారని అన్నారు. దేశంలో విధ్వంస పరిస్థితులు నెలకొన్నాయని జాతిపిత మహాత్మాగాంధీని చంపిన వ్యక్తిని పూజించడమే భారతదేశమా? అన్నారు. ఏ దేశంలోనైనా తమ జాతిపితను అవమానించే చర్యలు ఉంటాయా? అని ప్రశ్నించారు. దేశంలో పెఢదోరణులు నెలకొన్నాయని, ఏం ఆశించి ఈ విద్వేషాన్ని సృష్టిస్తున్నారన్నారు. దేశంలో ఓ రకమైన మత పిచ్చి రేపుతున్నారని మండిపడ్డారు. కుటిలబుద్ధితో రాజకీయలు చేస్తూ విధ్వంసం చేయడం తేలికేనని, అదే నిర్మాణం జరగాలంటే సుదీర్ఘ శ్రమ అవసరం అవుతుందని అన్నారు.
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రత్యక్షంగా 30 లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నాయని అన్నారు. ఎన్నో ప్రభుత్వాలు అనేక దశాబ్దాల కృషితో ఆ స్థాయికి చేరుకున్నాయని అన్నారు. అలాంటి రాష్ట్రంలో హిజాబ్, హలాల్, పూలు, పండ్లు కొనొద్దు అనే వివాదాలు రేపుతున్నారని మండిపడ్డారు. భారత రాజ్యంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ వృత్తినైనా ఎంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. 13 లక్షల మంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని, ఒక వేళ ఆ దేశంలో ఇలాంటి విద్వేషాలతో వెనక్కి పంపితే వారందరికి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వగలదా? అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఏం సాధిస్తారని అన్నారు.
- Tags
- top stories