- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP OBC Morcha : చేప పిల్లల బిడ్డింగ్‌లో రూ.100 కోట్ల అక్రమాలు
దిశ, తెలంగాణ బ్యూరో : చేప పిల్లల బిడ్డింగ్‌లో రూ.100 కోట్లఅక్రమాలు జరిగాయని, కమీషన్లకు కక్కుర్తి పడి దొడ్డిదారిని టెండర్ ప్రకారం కాకుండా దొడ్డిదారిన కేటాయింపులు జరుగుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఆరోపించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బిడ్లు పిలిచి అక్రమాలకు పాల్పడుతూ.. దొడ్డిదారిన కమిషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టు నచ్చినవాళ్లకు ఇస్తున్నారన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అత్యంత తక్కువ టైం లో అత్యంత ఎక్కువ అవినీతి అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వం కాంగ్రెస్సేనని విమర్శలు చేశారు.
అన్ని శాఖల్లో మంత్రులు పదేళ్ల దాహాన్ని తీర్చుకునేలా అవినీతికి పాల్పడుతుంటే స్వయంగా సీఎం సైతం ఆర్ ట్యాక్స్ తో అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ పాలననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని మండిపడ్డారు. మత్స్యకారులను పూర్తిగా మర్చి పోయారన్నారు. వానలతో చెరువులు నిండుతున్నా చేప పిల్లల పంపిణీని ఇంతవరకు ప్రారంభించలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 26 వేల 357 చెరువులు, కుంటలు ఉంటే కేవలం 85 కోట్ల చేప పిల్లల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, కనీసం వంద కోట్ల చేప పిల్లలనైనా పంపిణీ చేయాలని ఆనంద్ గౌడ్ డిమాండ్ చేశారు.