- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్కీంలో అవకతవకలు.. బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా
దిశ, నల్లగొండ: నల్లగొండలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అన్ని అవకతవకలు జరిగాయని నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నల్లగొండ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అసలైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా అనర్హులకు అందించారని ఆరోపించారు. డ్రాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు పారదర్శకంగా అర్హులను గుర్తించలేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ అర్హులను పారదర్శకంగా గుర్తించకుండా అన్ని రకాలుగా ఆర్థికంగా ఉన్న వారికి ఇండ్లు పంపిణీ చేయడం సిగ్గుచేటు అన్నారు.
తక్షణమే విచారణ జరిపించి ఇండ్లు లేని నిరుపేదలకు, ఒంటరి మహిళలకు, వికలాంగ కుటుంబాలకు ఇండ్ల కేటాయింపు చేయాలన్నారు. అలాగే వార్డుల మాదిరిగా కాకుండా అందరిని ఒక యూనిట్‌గా తీసుకొని ఇండ్ల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమయం తీసుకొని మళ్ళీ రీ సర్వే చేయించాలన్నారు. విచారణలో అవకతవకలు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నారు. మిగిలి ఉన్న నాలుగు వేల ఐదు వందల మంది లబ్ధిదారులను గుర్తించిన ప్రభుత్వ అధికారులు వెంటనే వారికి ఇండ్ల పంపిణీ చేయాలని ఈ విషయంలో కలెక్టర్ చొరవ చూపాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్, జిల్లా నాయకులు నాగం వర్షిత్ రెడ్డి, గడ్డం మహేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు సరితా, తదితరులు పాల్గొన్నారు.