- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో స్వల్ప ఊరట

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి (IPS officer Abhishek Mohanty) కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో ఊరట లభించింది. రాష్ట్ర విభజన తర్వాత అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల కేడర్ కేటాయింపులలో భాగంగా..అతన్ని ఏపీకి వెళ్లాలని కేంద్ర హోంశాఖ (Central Home Ministry) ఆదేశాలు ఇచ్చింది. కాగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. అభిషేక్ మహంతి క్యాట్‌ను ఆశ్రయించారు. అలాగే తన రిలీవింగ్ పై క్యాట్ విచారణ ముగిసే వరకు తనను రిలీవ్ చేయవద్దని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. అభిషేక్ మహంతి (Abhishek Mahanti) పిటిషన్ ను త్వరగా తేల్చాలి అని క్యాట్ ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అలాగే క్యాట్ లో విచారణ తేలే వరకు తెలంగాణ నుంచి ఆయనను రిలీవ్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అభిషేక్ మహంతి 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.. ఆయన తన స్థానికత (డొమిసైల్) ఆధారంగా తెలంగాణ కేడర్‌కు కేటాయించాలని కోరుకున్నారు. అయితే.. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సుల ప్రకారం.. అతనికి ఆంధ్రప్రదేశ్ కేడర్ (Andhra Pradesh Cadre) కు కేటాయించారు. ఈ కేటాయింపును సవాలు చేస్తూ అభిషేక్ మహంతి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (సీఏటీ)ని ఆశ్రయించారు. 2021 జులైలో సీఏటీ (CAT), అభిషేక్ మహంతిని తెలంగాణ కేడర్‌లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అతని స్థానికత హైదరాబాద్‌కు చెందినదని, అందువల్ల తెలంగాణ కేడర్ (Telangana Cadre)కు అర్హుడని తీర్పు ఇచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అతన్ని కేడర్‌లోకి తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతన్ని రిలీవ్ చేసినప్పటికీ, తెలంగాణలో అతనికి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో అతను జీతం లేకుండా కొన్ని నెలలు గడిపారు.
ప్రస్తుత స్థితి
ప్రస్తుతం అభిషేక్ మహంతి కేసు తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది. ఈ వివాదం రాష్ట్ర విభజన తర్వాత కేడర్ కేటాయింపుల్లో స్థానికత, న్యాయ పరమైన అంశాలపై సుదీర్ఘ చర్చకు దారితీసింది. అతని వాదనలు స్థానికత ఆధారంగా తెలంగాణ కేడర్‌పై ఆధారపడి ఉన్నాయి, అయితే కేంద్రం నిర్ణయం దీనికి విరుద్ధంగా ఉంది. ఈ కేసు తీర్పు ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేడర్ వివాదాలపై కూడా ప్రభావం చూపవచ్చు.