Raghunandan Rao: సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం.. రఘునందన్ రావు రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-28 14:58:23.0  )
Raghunandan Rao: సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం.. రఘునందన్ రావు రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం అందిందని కానీ తాను వెళ్లడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. తప్పు చేసిన మంత్రులకే సీఎం సపోర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దారిన పోయే దానయ్యలు ఫిర్యాదులు చేస్తే బీసీ బిడ్డని కేబినెట్ నుంచి తొలగించారని ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా అన్నారు. దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకున్నారని కేసీఆర్ అంటున్నారని వారిపై ఎంక్వైరీ చేయిస్తారా అన్నారు.

సీఎం కామెంట్స్ పై ఏసీబీ డీజీ సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారా అని ప్రశ్నించారు. అన్ని పథకాలలో కరప్షన్ ఉందని ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రిపై ఆరోపణలపై ఎందుకు విచారణ చేయడం లేదన్నారు. సచివాలం ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ వచ్చిందని.. 30న నియోజకవర్గంలో పనులు ఉన్నాయని తెలిపారు. సెక్రటేరియట్ ప్రారంభానికి వెళ్లడం లేదన్నారు.

Also Read..

హత్య వ్యవహారంలో నితీష్ కుమార్, కేసీఆర్ మధ్య డీల్ ? : బండి సంచలన వ్యాఖ్యలు

ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు డిప్రెషన్లో ఉన్నట్టే.. అవేంటో ఇక్కడ చూద్దాం

Advertisement

Next Story