- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం.. ఎందుకో తెలుసా..?
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ స్థితిగతులు మార్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై "డెవలప్మెంట్ ఎకనామిక్స్" అనే ఇతివృత్తంలో భాగంగా కీలకోపన్యాసం చేయాల్సిందిగా కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. తెలంగాణ పథకాల ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది.భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన లండన్లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యనివర్సిటీ కీలకోపన్యాసం ఇవ్వడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది.
గత పదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీని ఆకర్షించాయి. ఇటీవల బ్రిడ్జ్ ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్ లో పర్యటించిన సమయంలో యూనివర్సిటీ విద్యార్థులతో కల్వకుంట్ల కవితతో భేటీ అయిన విషయం తెలిసిందే. దాంతో తెలంగాణ అభివృద్ధి మోడల్ పై ఈ నెల 30వ తేదీన ప్రసంగించాల్సిందిగా కోరుతూ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది.
ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతులకు రైతుబంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్ అంశాలపై కవిత ప్రసంగిస్తారు. అలాగే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీఛార్జ్ అయ్యేలా కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించనున్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల పథకాల రూపకల్పన పై అంతర్జాతీయ వేదికపై కవిత వివరించనున్నారు. ఒక్కొక్క పథకం అమలు వెనక ఎంత ప్రయోజనం ఉందో చెప్పడమే కాకుండా సీఎం కేసీఆర్ ఆలోచనల ప్రతిరూపమే తెలంగాణ అభివృద్ధి అని అంతర్జాతీయ వేదికపై కవిత చాటి చెప్పనున్నారు.