‘ఆ పోలీసులపై హత్య కేసు నమోదు చేయండి’

by GSrikanth |
‘ఆ పోలీసులపై హత్య కేసు నమోదు చేయండి’
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టించిన ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా అమికస్ క్యూరీ దేశాయ్ ప్రకాశ్ రెడ్డి వాదన వినిపించారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలన్నారు.

అయితే వాదనలు వినిపించేందుకు తమకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో తదుపరి విచారణ ఈనెల 29కి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని జ్యుడీషియల్ కమిషన్ గతంలోనే తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు అధికారులపై కేసు నమోదు చేయాలని నివేదికలో స్పష్టం చేసింది.

Advertisement

Next Story