NTR జిల్లాలో కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్.. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం

by Satheesh |
NTR జిల్లాలో కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్.. ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలకు అంతరాయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎగువన కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కట్లేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది. ఈ క్రమంలో వరద ప్రవాహానికి అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఎన్టీఆర్ జిల్లా నుండి ఏపీ-తెలంగాణకు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో ఈ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలో మీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో వాహనాదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో చేసేదేమి లేక 30 కి.మి చుట్టూ తిరిగి ప్రజలు రాకపోకలు సాగిస్తు్న్నారు. ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు బలపడినే నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Advertisement

Next Story