ఇంటర్నేషనల్ స్కూల్ ఆక్రమణలు కూల్చేసిన హైడ్రా

by M.Rajitha |
ఇంటర్నేషనల్ స్కూల్ ఆక్రమణలు కూల్చేసిన హైడ్రా
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా మరోసారి కొరడా ఝుళిపించింది. మంగళవారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో ఆక్రమణలను కూల్చివేసింది. ఐలాపూర్ తండాలో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించినట్టు గుర్తించిన అధికారులు, దానిని రక్షించేందుకు రంగలోకి దిగారు. సర్వే నంబర్ 119లో వేసిన సరిహద్దు రాళ్ళను, ఫెన్సింగ్ ను తొలగించారు. అలాగే ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆక్రమించిన 15 గుంటలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలంలో స్కూల్ యాజమాన్యం గదులు, ప్రహరీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను ఆక్రమించి, నిర్మాణాలు చేపడితే తీవ్ర చర్యలు ఉంటాయని అధికారులు మరోసారి హెచ్చరించారు.

Next Story

Most Viewed