- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలోనే ధరణిపై మధ్యంతర నివేదిక.. పొంగులేటితో దరణి కమిటీ
దిశ, వెబ్ డెస్క్: ఇవ్వాళ సచివాలయంలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తో ధరణి కమిటీ భేటీ అయ్యింది. నిన్న జరిగిన భేటీలో ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారాల కోసం ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ధరణి కమిటీ చెప్పింది. ఈ నేపధ్యంలో మధ్యంతర ఉత్తర్వులపై రెవెన్యూ శాఖ మంత్రితో కమిటీ సభ్యులు చర్చలు జరిపారు.
రేపు సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు మరో రెండు జిల్లాల కలెక్టర్లతో కలిపి, మొత్తం నాలుగు జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్ఏ కార్యాలయంలో ధరణి కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో క్షేత్రస్థాయిలో భూ సమస్యలపై కమిటీ చర్చించుకొని, అలాగే ధరణి వల్ల రైతులు పడ్డ ఇబ్బందులపై ఆరా తీయనుంది. ఈ భేటీ అనంతరం రెవెన్యూ శాఖ మంత్రికి పూర్తి స్తాయి మధ్యంతర నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సీఎం రేవంత్ రెడ్డి తో చర్చ జరపనున్నట్లు తెలుస్తొంది.
Read More..