అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ సీన్.. ఈటలతో కేటీఆర్ ప్రత్యేక భేటీ!

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-03 11:13:23.0  )
అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ సీన్.. ఈటలతో కేటీఆర్ ప్రత్యేక భేటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల వద్దకు కేటీఆర్ వెళ్లి ప్రత్యేకంగా కలిశారు. తొలుత ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పది నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అయితే ఇటీవల ఈటల భద్రత విషయంలో కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున భద్రత కల్పించాలని డీజీపీని ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.

Advertisement

Next Story