- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Police: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు వేలకు వేలు సంపాదించవచ్చా? తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్

దిశ, డైనమిక్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ (Smartphone) ఉంటే చాలు వేలకు వేలు సంపాదించవచ్చా? అని నెట్టింట (Telangana Police) తెలంగాణ పోలీస్ పేర్కొంది. (Cyber crimes) సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తూ తెలంగాణ పోలీస్ (@TelanganaCOPs) ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా తాజాగా ఆసక్తికర ట్వీట్ చేసింది. కేవలం మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు రోజూ వేలల్లో సంపాదించవచ్చనే ప్రకటనలను నమ్మకండని సూచించింది. ఇంట్లోనే ఉంటూ గంటకు వేలు ప్రకటనల్ని కూడా నమ్మొద్దని తెలిపింది. అదేవిధంగా స్మార్ట్ ఫోన్‌లో రేటింగ్ రేటింగ్ ఇస్తే చాలు డబ్బులు వస్తాయనేది అబద్దమని, స్మార్ట్‌గా మీ ఖాతా ఖాళీ చేసే ప్లాన్ అది అని పేర్కొంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) అంటూ వల వేసి దోచే ముఠాలున్నాయని, తొలుత డబ్బులు ఎరవేసి.. ఆ తర్వాత మిమ్మల్ని సర్వం దోచే కుట్ర ఇదని తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటనలను అస్సలు నమ్మకండని సూచనలు చేసింది. (cyber frauds) సైబర్ మోసాలపై అవగాహన ముఖ్యమని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.