ఇంటర్ పరీక్షలు షురూ.. నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ

by Mahesh |
ఇంటర్ పరీక్షలు షురూ.. నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష జరగనుంది. దీంతో ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద ఎగ్జామ్‌ హాలుకు చేరుకున్నారు. ఉదయం 9 గంటల తర్వాత పరీక్షా కేంద్రానికి వచ్చిన విద్యార్థులను అధికారులు అనుమతించలేదు.

పరీక్షలు జరిగే ప్రతిరోజు ఉదయం 8.00 నుంచి 9 గంటల వరకు ఎగ్జామ్​కు అనుమతి ఇస్తారు. దీంతో విద్యార్థులను వారి తల్లిదండ్రుల ముందుగానే ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. కాగా, ఇంటర్‌ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఏప్రిల్‌ 4 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి

Advertisement

Next Story

Most Viewed