- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harish Rao : రేవంత్ అమరవీరులను అవమానిస్తున్నారు : హరీష్ రావు
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ ఉద్యమం(Telangana Movement), ఏర్పాటు గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ఎద్దేవా చేశారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా రేవంత్ రెడ్డి పాల్గొనలేదని, జై తెలంగాణ అనలేదని.. అసలు ఆయనకు తెలంగాణ ఉద్యమం, అమరవీరుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కేసీఆర్(KCR) ఆమరణ దీక్షతో డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన(Telangaan Decleration) వెలువడిందని.. తెలంగాణ ఏర్పాటు ఆలస్యం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని మండి పడ్డారు. ఎవరో దయతో తెలంగాణ వచ్చింది అనడం.. ఉద్యమాన్ని, అమరవీరులను అవమానించడమే అన్నారు. 1969 నుంచి 2014 వరకు తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని మండిపడ్డారు. టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని గెలిచాక.. తెలంగాణను పక్కన పెట్టిన ఘనత ఆ పార్టీదే అని పేర్కొన్నారు. దేశంలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి, లేఖలు తెచ్చి.. తెలంగాణ ఏర్పాటుకు తీవ్రంగా కష్టపడ్డది కేసీఆర్ అన్నారు. అంతమంది ఒప్పుకున్నా తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసి ఎంతోమంది విద్యార్థులు, ప్రజలు అమరులవడానికి కారణం ఎవరో గుర్తు తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. డిసెంబర్ 9 తెలంగాణ గొప్ప దినమని.. అయితే అది ఎవరి పుట్టిన దినమో.. విగ్రహం ఆవిష్కరించిన రోజు మాత్రం కాదని.. కేసీఆర్ 11 రోజులు ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ ప్రకటన తెచ్చిన రోజని అన్నారు. అంతేగాని సోనియా గాంధీ(Sonia Gandhi) దయతో ఇచ్చింది కాదని.. అలా అయితే దేశ స్వాతంత్ర్యం.. సమరయోధుల పోరాటాల వల్ల కాకుండా బ్రిటిష్ వాళ్ళ దయ వల్ల వచ్చింది అనుకోవాలా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఇదే రేవంత్ రెడ్డి సోనియాను బలిదేవత అన్నారని, మరిపుడు దేవత అనేందుకు నోరు ఎలా వచ్చిందన్నారు.