అమానుషం.. రోగిని రెండు కాళ్లు పట్టి నేలపై లాక్కెళ్లిన తల్లిదండ్రులు

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-15 07:22:24.0  )
అమానుషం.. రోగిని రెండు కాళ్లు పట్టి నేలపై లాక్కెళ్లిన తల్లిదండ్రులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్ట్రెచర్ లేకపోవడం, వీల్ చైర్ లేక పేషెంట్ కేర్ సిబ్బంది రాకపోవడంతో పేషెంట్ కాళ్ళను పట్టుకొని లాక్కుంటూ తీసుకువెళ్లిన ఘటన కలకలం రేపింది. మార్చి 31న రాత్రి 10 గంటల ప్రాంతంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అపస్మారక స్థితిలో వచ్చిన పేషెంట్‌ను పరీక్షించిన వైద్యులు జనరల్ ఫిజీషియన్‌కు చూపించుకోవాలని సలహా ఇచ్చారు. సదరు పేషెంట్‌ను ఆసుపత్రిలో వెయిటింగ్ హాల్ వద్ద కుర్చీలోనే రాత్రి అంతా కూర్చుండబెట్టారు.

ఈ నెల ఒకటిన నా ఉదయం ప్రాంతంలో ఓపి రాయించిన తల్లిదండ్రులు స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో పేషెంట్‌ని కుటుంబ సభ్యులు నేలపైనే పడుకోబెట్టి, రెండు కాళ్లు పట్టి లాక్కేళ్లడం కలకలం రేపింది. అక్కడ ఉన్న సిబ్బంది సైతం చూస్తూ నివ్వెరపోవడం చర్చనీయాంశంగా మారింది. రోగిని లోపలికి తరలించేందుకు సిబ్బంది ఆస్పత్రిలో కేర్ సిబ్బంది, వార్డ్ బాయ్‌లు ముందుకు రాకపోవడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో బయటి నుంచి లిఫ్ట్ దాకా పేషంట్ కాళ్లు పట్టుకుని తీసుకువెళ్లిన దృశ్యాలు స్థానికులను కలిచివేసాయి. పేషెంట్ ను లాకెళ్తున్న వీడియో ఓ వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈనెల1న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై మండిపడుతున్నారు. కరోనా మొదటి దశ సమయంలో ప్యాసింజర్ ఆటోలో కరోనా మృతదేహాన్ని తరలించిన దృశ్యాలు దుమారం రేపింది. తాజాగా ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషయంపై జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతీమరాజ్ దిశతో మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రిలో సంబంధిత రోగి వచ్చినప్పుడు తక్షణ వైద్య సేవలు అందించామని లోపాలు ఏమి లేవని తెలిపారు. కేర్ టేకర్ సిబ్బంది వీల్ చైర్ కోసం వెళ్లేసరికి లిఫ్ట్ రెడీగా ఉందని తల్లిదండ్రులు రోగిని కాళ్లు పట్టుకొని లాక్కొనీ పోయింది వాస్తవమేనని తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటన‌పై మంత్రి హరీశ్ రావు స్పందించారు. నిజానిజాలు తెలిసేలా విచారణ చేసి, వెంటనే నివేదిక అందజేయవలసిందిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు అదేశాలు జారీ చేశారు.

నిజానిజాలు తెలిసేలా విచారణ చేసి, వెంటనే నివేదిక అందజేయవలసిందిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు అదేశాలు

ఇవి కూడా చదవండి:

ఎన్నికల్లో సత్తాచాటేందుకు పొంగులేటి బిగ్ స్కెచ్! పోటీ అక్కడి నుంచే..?

Advertisement

Next Story