Harish Rao : ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? : హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |
Harish Rao : ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్(Errolla Srinivas) అరెస్టు(Arrest)పై మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అడిగితే అరెస్టులు..ప్రశ్నిస్తే కేసులు..నిలదీస్తే బెదిరింపులు..ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? అంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని, కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికమని విమర్శించారు.

ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని, సెలవు రోజుల్లో కావాలని మా నేతలను అరెస్ట్ చేస్తూ, సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారని, ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి, మీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వారు మేము కాదని గుర్తుంచుకోండని.. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed