ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలు విడుదల.. తెలంగాణలో ఆ పార్టీదే హవా

by Prasad Jukanti |
ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలు విడుదల.. తెలంగాణలో ఆ పార్టీదే హవా
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థిస్తులపై పలు సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాయి. ప్రజల మూడ్ ఎలా ఉందో లెక్క కడుతూ ఫలితాలు వెలువరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు జాతీయ సర్వే సంస్థలు తమ అంచనాలను వెలువరించగా తాజాగా మంగళవారం ఇండియా టీవీ- సీఎన్ ఎక్స్ ఒపీనియన్ పోల్ లో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడించింది.ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను కాంగ్రెస్ 8 స్థానాలు, బీజేపీ 6 స్థానాలు, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ అంచనాల ప్రకారం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మరింద అధ్వానంగా మారబోతున్నదని గతంలో 9, స్థానాలను గెలుచుకున్న గులాబీ పార్టీ ఈసారి కేవలం 2 స్థానాలకే లిమిట్ కాబోతున్నదన్న అంచనా సంచలనంగా మారింది.

గత కొంత కాలంగా కేసీఆర్ రంగంలోకి దిగి పార్టీని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ నేతలు చేజారిపోకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నా అవేవి ప్రజల మన్ననలను పొందలేకపోతున్నాయని ఫలితంగా ఆ పార్టీ గ్రాఫ్ ఫాల్ డౌన్ అవుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నది. అధికారం కోల్పోయిన అనతి కాలంలోనే ఆ పార్టీ కేవలం రెండు స్థానాల్లోనే గెలుస్తారనే సర్వే ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణులలో సంచలనం రేపుతున్నది. మరి ఎన్నికల నాటికి సత్తా చాటేందుకు గులాబీ బాస్ కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది సస్పెన్స్ గా మారింది.

Advertisement

Next Story