మోడీ ప్రధాని అయిన తర్వాత క్రీడల్లో అద్భుతమైన ఫలితాలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Satheesh |
మోడీ ప్రధాని అయిన తర్వాత క్రీడల్లో అద్భుతమైన ఫలితాలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్రీడాకారులు క్రీడల్లో సత్తా చాటాలని, ఎంచుకున్న క్రీడల్లో ప్రతిభ చాటి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కేంద్ర మంత్రి జి. కిషన్​రెడ్డి అన్నారు. ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ పేరుతో సికింద్రాబాద్​పార్లమెంట్​పరిధిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అమ్మాయిలు కిసీ సే కమ్​నహీ అన్నట్లుగా అద్భుతంగా ఆడారని ఆయన అభినందించారు. గురువారం జింఖానా గ్రౌండ్‌లో నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ ఒక విజన్‌తో క్రీడలకు సంబంధించి దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పోటీలు నిర్వహించాలని చెప్పారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ఒలింపిక్స్ సహా ఇతర అంతర్జాతీయ పోటీల్లో మన దేశ క్రీడాకారులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు.

దేశం ప్రపంచంలో అనేక అంశాల్లో నెంబర్ వన్‌గా ఉన్నప్పటికీ క్రీడల్లో కొంత వెనుకబడి ఉండే వాళ్లం. కానీ మోడీ ప్రధాని అయిన తర్వాత ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు మంచి ప్రతిభ సాధించారని తెలిపారు. తెలంగాణలో కూడా ప్రభుత్వంతో పాటు వ్యక్తులు, సంస్థలు క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది” అని అన్నారు. గత 7 రోజులుగా దాదాపు 7 వేల మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో లోక్​సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్​నారాయణ, బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి మురళీధర్ రావు బీజేపీ సీనియర్​నాయకులు, జాతీయ స్థాయి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed