మంత్రి మల్లారెడ్డికి విజనరీ మ్యాన్ అవార్డు

by Mahesh |   ( Updated:2023-08-15 15:06:19.0  )
మంత్రి మల్లారెడ్డికి విజనరీ మ్యాన్ అవార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అంటే తెలియన తెలంగాణ పౌరుడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే వేదిక ఎదైన.. తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ మల్లారెడ్డి వార్తల్లో నిలుస్తారు. కాగా మల్లారెడ్డి పేరు మీద హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా కాలేజీలు ఉన్నాయి. అయితే మంగళవారం 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సూరారం లోని మెడికల్ కాలేజీలో ఆయన మాట్లాడారు. తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని పదే పదే చెప్పే మల్లారెడ్డి.. తాజాగా తన కష్టాన్ని గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్ అవార్డు తనను వరించిందని చెప్పుకొచ్చాడు. కాగా తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రజల ఆశీర్వాదమే కారణమని తెలిపారు. తానే ఎన్నో కాలేజీలను ఏర్పాటు చేసి డాక్టర్లు, ఇంజినీర్లను తయారు చేశానని..ఆ ఫలితంగానే తనకు విజనరీ మ్యాన్ అవార్డు వచ్చిందని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story