- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
27న ప్రవాసీ ప్రజావాణి ప్రారంభోత్సవం.. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రత్యేక కౌంటర్
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ఈ నెల 27న శుక్రవారం ఉదయం 10 గంటలకు గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వం ప్రతి మంగళ, శుక్ర వారాలలో నిర్వహిస్తున్న ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థలోనే ప్రవాసుల కోసం ఒక ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తారని ఆయన తెలిపారు.
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమన్వయంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమక్షంలో ‘ప్రవాసీ ప్రజావాణి’ కౌంటర్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని వినోద్ కుమార్ తెలిపారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ అధికారి దివ్యా దేవరాజన్, ఐఏఎస్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తదితరులు పాల్గొంటారని వెల్లడించారు.