- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మునుగోడులో డాక్టర్ కోమటిరెడ్డి పోటీకి కారణం ఇదే! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ బై పోల్‌లో ఎలాగైనా గెలవాలని అధికార, విపక్ష నేతలు భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా ఓ MBBS డాక్టర్ మునుగోడులో నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన కోమటిరెడ్డి సాయితేజ రెడ్డి అనే ఓ డాక్టర్ ఉప ఎన్నికలో నామినేషన్ వేశారు. సాయితేజరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. మునుగోడు ప్రచారంలో భారంగా సాయితేజరెడ్డి ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన తీరు చూసే తనకు ఉప ఎన్నికల్లో నామినేషన్ వేయాలనిపించిందని తెలిపారు. రాష్ట్రంలో రైతులు, పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వాళ్ల బాధలు చూసే తనకు బరిలో నిలవాలనిపించిందని వ్యాఖ్యానించారు. అయితే, సాయితేజ రెడ్డి పోటీ వల్ల రాజగోపాల్ రెడ్డికి స్వల్ప నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి ఇంటి పేరు సేమ్ కావడంతో వృద్ధులు గందరగోళానికి గురై రాజగోపాల్ రెడ్డి ఓట్లు సాయితేజ రెడ్డికి పడే అవకాశం ఉందని మేధావులు చర్చించుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : ఎనిమిదేళ్లుగా అన్యాయానికి గురవుతున్న మును'గోడు'