పేరేడ్ గ్రౌండ్‌లో సీఎం రేవంత్, భట్టి జోక్స్.. నవ్వుకున్న సీతక్క!

by Ramesh N |   ( Updated:2024-03-16 06:21:06.0  )
పేరేడ్ గ్రౌండ్‌లో సీఎం రేవంత్, భట్టి జోక్స్.. నవ్వుకున్న సీతక్క!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం మహాలక్ష్మి స్వశక్తి మహిళా సదస్సు అట్టహాసంగా జరుగుతోంది. వడ్డీ లేని రుణాలు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు బీమా సౌకర్యంతో పాటు పలు అంశాలపై సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు తెలంగాణ నలు మూలల నుంచి మహిళలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఇతర మంత్రులు సభకు హాజరయ్యారు.

ఈ సదర్భంగా స్టేజీ ర్యాంప్‌పై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఇతర మంత్రులు వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఆ సమయంలో సభలో ఉన్న మహిళలు సీఎం రేవంత్ రెడ్డి ఫేమస్ పాట అయిన ‘మూడు రంగుల జెండా పట్టి’ అనే సాంగ్ పెట్టాలని అందరూ అరిచారు. ఆ సమయంలో ర్యాంప్ పై నడుస్తున్న సీఎంకు భట్టి ఏదో చెబుతూ నవ్వుతుంటారు. వారి వెనుక ఉన్న మంత్రి సీతక్క కూడా వారిని చూసి నవ్వుతుంది. అనంతరం మహిళలు కోరినట్లుగానే మూడు రంగుల జెండా పట్టి డీజే సాంగ్ సభలో ప్లే చేశారు. తర్వాత మహిళలు ఆనందంతో వాళ్లు నిలుచున్న చోటే నృత్యాలు చేశారు.

Advertisement

Next Story