- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూసీ ప్రక్షాళన ఎన్ని ఏళ్లలో కంప్లీట్ చేస్తారు..? ఎమ్మెల్యే కేపీ వివేకానంద
దిశ, తెలంగాణ బ్యూరో: మూసీని ఎన్నెళ్లలో ప్రక్షాళన చేస్తారో, ప్రాజెక్టును ఎప్పటివరకు కంప్లీట్ చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీలో మున్సిపల్ శాఖ పద్దుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూసీని లక్షన్నరకోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి బడ్జెట్‌లో పెట్టింది కేవలం 1500కోట్లు మాత్రమేనన్నారు. కేటాయింపులు ఇలా చేస్తే పదేళ్లు పడుతుందన్నారు. నిధులు ఎలా సేకరిస్తారు..? ఎన్నేళ్లలో పూర్తి చేస్తారు..? గతంలో తయారుచేసిన డీపీఆర్ తీసుకుంటారా..? బేషజాలకు పోకుండా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో మార్గంను రద్దు చేయడం బాధాకరం అన్నారు. ఈ ప్రాంతంలో 10లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారన్నారని, ఉద్యోగాలు చేస్తున్నారని, ఆ రైల్ మార్గం చాలా అవసరం అన్నారు.
గత ప్రభుత్వం ఎస్ఎన్డీపీతో నాలాల అభివృద్ధి పనులు చేపట్టిందని, కొన్ని మిగిలిపోయాయని, వెంటనే నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు. సెకండ్ ఫేజ్‌లో రూ.2141కోట్లకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, వెంటనే మంజూరు చేయాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్‌కు ప్రత్యేకంగా రూ.4305కోట్లు ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. సుంకిశాల నుంచి వాటర్‌ను సప్లయికి రూ.2100కోట్లు అవసరం కాగా వెయ్యికోట్లు మాత్రమే కేటాయించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి 8 నెలలు అవుతుందని హనీమూన్ పిరియడ్ అయిపోయిందని, ఇక అభివృద్థి పనులపై దృష్టిసారించాలని కోరారు.