పంట బీమాపై మంత్రి సీతక్క కీలక ప్రకటన

by Prasad Jukanti |
పంట బీమాపై మంత్రి సీతక్క కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: అకాల వర్షాలతో పంట నష్టపోయి సతమతం అవుతున్న అన్నదాతల కోసం పంట బీమా పథకం అమలు చేస్తామని చెబుతున్న రాష్ట్ర సర్కార్ ఆ దిశగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పంటల బీమా పథకం రాబోయే వానా కాలం సీజన్ నుంచే మొదలు పెట్టబోతున్నట్లు తాజాగా మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. రైతులపై భారం పడనివ్వకూడదనే ఉద్దేశంతో ఆ ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ తరపున ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న సీతక్క ఈ మేరకు శనివారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో ధాన్యం తడిసి ఆందోళనలో ఉన్న రైతాంగానికి సీతక్క ధైర్యం చెప్పారు. తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిచిన ప్రతి ధాన్యపు గింజ మద్దతు ధరకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో కురుస్తున్న వర్షం పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.కాగా వానాకాలం సీజన్ నుంచే పంటల బీమాను అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు ఇదివరకే అధికారులను ఆదేశించారు. పంటల బీమా ప్రతిపాదనలను పరిశీలించాలని ఎన్నికల సంఘం అనుమతితో టెండర్ల ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed