- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను తరిమికొట్టాలి: రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
by Shiva |
X
దిశ, తెలంగాణ బ్యూరో: మతోన్మాద, రజాకార్ల పార్టీ అయిన ఎంఐఎంకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, అలాగే పాతబస్తీలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను తరిమికొట్టాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో బూత్ స్థాయి, ఆ పైస్థాయి కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీని మరోసారి గెలిపించాలంటే పోలింగ్ బూత్ నుంచే సాధ్యమవుతుందని అన్నారు. మోడీకి కుటుంబం లేదన్న వారికి తాను ఒక్కటే చెబుతున్నానని, మోడీకి దేశమంత కుటుంబం ఉందన్నారు. ఇతర నేతలు వారి కుటుంబం బాగు కోసమే చూస్తారని, కానీ మోడీ ప్రజలు బాగుండాలని కోరుకుంటారన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ను సీఎం చేయాలని ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. రాబోయే 40 రోజులు బూత్‌కి పరిమితమై కష్టపడి పని చేయాలని బూత్ స్థాయి నేతలు, కార్యకర్తలను లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
Advertisement
Next Story