- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
IG Satyanarayana: వికారాబాద్ దాడి ఘటనలో ఎవరున్నా వదిలిపెట్టం
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ దాడి ఘటన(Vikarabad incident)లో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టబోమని ఐజీ సత్యనారాయణ(IG Satyanarayana) అన్నారు. సోమవారం దాడి ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. దాడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన అందరిపైనా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే ఈ దాడిలో పాల్గొన్న 15 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారి ఫోన్ల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తామని అన్నారు. ప్రస్తుతం దాడి వెనుక ఎవరు ఉన్నారు? ఎవరు ప్రేరేపించారనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
బయటినుంచి వచ్చిన వారు కూడా దాడిలో పాల్గొన్నారని అన్నారు. ఎవరినీ వదిలిపెట్టమని.. అందరినీ గుర్తించి చర్యలు తీసుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. అదనపు కలెక్టర్, కడా చైర్మన్, డీఎస్పీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, ఫార్మా పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అదనపు కలెక్టర్‌పై గ్రామస్తులు, రైతులు రాళ్లు విసిరి, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దుద్యాలలో చోటుచేసుకుంది.