చంపితే స్వర్గానికి పోతా : కేఏ పాల్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-20 07:18:28.0  )
చంపితే స్వర్గానికి పోతా : కేఏ పాల్
X

దిశ, వెబ్ డెస్క్ : : కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల పాలక వర్గాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని వారు నన్ను చంపాలని చూస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేవి పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపితే స్వర్గానికి పోతానని, వారు మాత్రం నరకానికి పోతారన్నారు. గతంలో తనను చంపాలని అనుకున్న వారే చచ్చి పోయారని కీలక వ్యాఖ్యలు చేశారు నాకు భద్రత కల్పించాలని ప్రధాని మోడీ, అమిత్ షా లకు లేఖ రాశానని పాల్ తెలిపారు. ప్రభుత్వాల అసంబద్ధ విధానాలపై కేసులు వేస్తున్నా.. కోర్టుల్లో పోరాడుతున్నా.. ఎన్నో కేసుల్లో స్టేలు తీసుకువస్తున్నానని, దీంతో కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికోసం పని చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్, కాంగ్రెస్ లు నాకు శత్రువులని చెప్పుకొచ్చారు.

రైతులు ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగేలా సీఎం రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని, ఆయన తన విధానాలను మార్చుకోవాలని పాల్ సూచించారు. వేలాది మంది గ్రూప్ వన్ అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే పోలీసు దాడులు చేయడం బాధాకరమన్నారు. అభ్యర్థులను గాయపరచడం సరైన చర్య కాదని, పరిపాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చెయ్యాలని వ్యాఖ్యానించారు. కొండా, దానం, మేయర్ రౌడీల్లా వ్యవహరిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంత అవినీతి ప్రాజెక్టు లేదని చెప్పిన రేవంత్ సీబీఐ కి లెటర్ రాయడం లేదని ప్రశ్నించారు. 10 నెలల్లో ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పీఎస్ సమీట్ నిర్వహిద్దాం, 20 లక్షల కోట్ల అప్పు తీర్చుదాం. లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిద్దామని, మార్పు రావాలి అని భావించినోళ్లు నాకు మద్దతుగా నిలవాలని కోరారు.


హైడ్రా డ్రామాల తయారైందని, నాగార్జునకు ఒక న్యాయం, రేవంత్ రెడ్డి తమ్ముడికి ఒక న్యాయమా? అని నిలదీశారు. భూకబ్జా చేసినోళ్ళను పట్టుకోలేదు, అమ్మినోళ్ళను, అనుమతులు ఇచ్చినోళ్ళను వదిలేసి ఇండ్లు కొన్నవాళ్లకు మాత్రం అన్యాయం చేస్తున్నారన్నారు. మూసీ పునర్జీవం అంటున్న రేవంత్ రెడ్డి లక్ష 50 వేల కోట్లు ఎక్కడినుంచి తెస్తారని, 7 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేస్తే, రేవంత్ కూడా అదే దారిలో నడుస్తున్నారు. పోలీసులు ప్రభుత్వం అనధికారికంగా ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారని..వారిపైనా కేసు వేయాల్సి వస్తోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed