- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే.. కోర్టుకీడుస్తా : కేటీఆర్ వ్యాఖ్యలపై మాణిక్కం ఠాగూర్ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్న తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఝలక్ ఇచ్చేందుకు తెలంగాణ పీసీసీ మాజీ చీఫ్ మాణిక్కం ఠాగూర్ సిద్ధమవుతున్నారు. గతంలో ఇలాంటి వాస్తవ విరుద్ధమైన కామెంట్లు చేసినందుకు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి మధురై కోర్టులో హాజరైనట్లుగానే ఇకపైన కేటీఆర్2కు అదే తరహా తిప్పలు తప్పవని మాణిక్కం ఠాగూర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను అందుకు ఆయన ఆధారంగా చేసుకున్నారు.
సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న సందర్భంలో ‘నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రివి కాదు.. ఢిల్లీ ద్వారా మేనేజ్‌మెంట్ కోటాలో, మేనేజ్ చేసుకుని.. మాణిక్కం ఠాగూర్‌కు రూ.50 కోట్లిచ్చి, మళ్లీ ఢిల్లీకి వెళ్లి మేనేజ్ చేసుకుని తెచ్చుకుని పదవి తప్పా.. ప్రజలంతా కూడబలుక్కొని ఎన్నుకోదని.. ఎన్నటికీ నువ్వు కేసీఆర్ కాలిగోటికి సరిపోవు’ అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న మాణిక్కం ఠాగూర్ మధురై హైకోర్టు బెంచ్‌లో కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేయాలనుకుంటున్నట్లు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా తెలిపారు.