TSRTC : బస్సెక్కితే.. బహుమతులు

by Shiva |   ( Updated:2023-10-10 11:17:10.0  )
TSRTC : బస్సెక్కితే.. బహుమతులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దసరా పండుగకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) బస్సుల్లో మీరు ప్రయాణిస్తున్నారా..? కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సొంతూళ్లకు వెళ్తున్నారా..? అయితే, మీరు రూ.11 లక్షల నగదు బహుమతులు గెలుపొందే అద్భుత అవకాశాన్ని టీఎస్ ఆర్టీసీ కల్పిస్తోంది. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుకాల మీ పూర్తి పేరు, ఫోన్ నంబర్ ని రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో వేయడమే.

రాఖీ పౌర్ణమి మాదిరిగానే దసరాకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11లక్షల నగదు బ‌హుమ‌తులు అందించనుంది. ప్రతి రీజియన్‌కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు, అంటే మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ.9,900 చొప్పున బహుమతులను ఇవ్వనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. దసరా లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story