గతంలో స్మితా సబర్వాల్‌ది తప్పైతే.. డిప్యూటీ సీఎం భట్టి విషయంలో కూడా తప్పే!

by Ramesh N |   ( Updated:2024-03-11 14:28:24.0  )
గతంలో స్మితా సబర్వాల్‌ది తప్పైతే.. డిప్యూటీ సీఎం భట్టి విషయంలో కూడా తప్పే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: యాదాద్రిలో బ్రహ్మోత్సవాల తొలి పూజ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ పార్టీతో సహా పలువురు నెటిజన్లు భట్టికి జరిగిన దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజ సమయంలో సీఎం దంపతులు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద పీటలపై కూర్చున్నారు. డిప్యూటీ సీఎం భట్టికి మాత్రం చిన్న పీట వేసి పక్కన కూర్చోబెట్టారు. దీంతో భట్టికి చిన్న పీట వేసి అవమానించారని నెట్టింట వైరల్ అయ్యింది.

దళిత సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎంకు దేవుడి సాక్షిగా అవమానం జరిగిందంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే నేడు భట్టికి అవమానం జరిగిందని నెటిజన్ల ఆరోపణలపై గతంలో ఐఏఎస్ అధికారిని స్మీతా సబర్వాల్ ఎదుర్కొన్న ట్రోల్స్‌కు ముడిపెట్టారు. గతంలో ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ను విపరీతంగా నెటిజన్లు ట్రోల్స్ చేశారు.

మంత్రిగా సీతక్క బాధ్యతలు తీసుకున్న సమయంలో స్మితా సబర్వాల్ సీతక్కను కలిశారు. ఆ సమయంలో వారు చాంబర్‌లో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ సమయంలో అధికారిని స్మితా సబర్వాల్ సీతక్క ముందు సోఫాలో కాలుపై కాలు వేసుకుని కూర్చుని మాట్లాడుతుంది. దీంతో ఆమె కూర్చునే తీరుపై నెటిజన్లు ట్రోల్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ‘స్మిత సబర్వాల్ తీరు సీతక్క విషయంలో తప్పిదం అయితే, ఈ రెడ్ల తీరు కూడా భట్టి గారి విషయంలో తప్పిదమే’ అని ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం పోస్ట్ చేశారు.

Advertisement

Next Story