జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి భద్రత కల్పిస్తా : మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద

by M.Rajitha |
జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి భద్రత కల్పిస్తా : మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి భద్రత కల్పిస్తానని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం బాధితురాలకి సెక్యూరిటీ లేదని, పోలీసులకి సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశిస్తానని వివరించారు. వాస్తవానికి, లైంగిక వేధింపులు అనేది పెద్ద సమస్య అని ఆమె వ్యాఖ్యానించారు. బయటికి వచ్చి చెప్పుకోవడానికి కూడా కొంతమంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగాలు పోతాయని, పరువు లాంటి అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయన్నారు. మహిళలకు స్వేచ్ఛ అవసరమని, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోలకత్తా ఘటన కూడా ఇటీవల మనమంతా చూశామన్నారు. పాశవికంగా ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలపై లైంగిక దాడుల విషయంలో తాము రెండు కమిటీలు కూడా వేశారని తెలిపారు. జాని మాస్టర్ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న లేడి కొరియోగ్రాఫర్ ను లైంగికంగా వేధించారన్న ఫిర్యాదులు అందాయన్నారు. తమకు కూడా ఆ బాధిత మహిళ ఫిర్యాదు చేశారన్నారు. మహిళలపై ఎవరు అసభ్యంగా ప్రవర్తించిన వదిలేదని చెప్పారు. మహిళలు ఏ రంగంలో ఉన్న తమకు ఏ ఇబ్బంది కలిగిన తమకు తెలియజేయండి అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed